Kedar Jadhav: బీజేపీ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ ‘‘కేదార్ జాదవ్’’..
- బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్..
- గతేడాది క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన జాదవ్..
Kedar Jadhav: భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన జాదవ్, ఇప్పుడు రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల కేదార్ జాదవ్ మంగళవారం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో అధికారికంగా చేరారు. మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే ఆయనను పార్టీలోకి స్వాగతించారు.
Read Also: CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్‌కు డేట్ లాక్
Also Read
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
మహారాష్ట్ర పూణేలో 1985 మార్చి 26న జన్మించిన కేదార్ జాదవ్ 2014లో శ్రీలంకపై భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్న జాదవ్ మొత్తం 73 వన్డేల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించారు. 42.09 సగటుతో 1,389 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్నర్‌గా వన్డేల్లో 5.15 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టాడు. జాదవ్ దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.
2017లో పూణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 76 బంతుల్లోనే 120 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జాదవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో 12వ ఓవర్లో విరాట్ కోహ్లీతో కలిసి చారిత్రాత్మక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించి, 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పారు.
#WATCH | Former Indian Cricketer Kedar Jadhav joins BJP in the presence of Maharashtra minister and state BJP chief Chandrashekhar Bawankule in Mumbai. pic.twitter.com/4reAKk7F1Y
— ANI (@ANI) April 8, 2025
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!