మరో పది రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న వేళ మాజీ బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే బీజేపీని వీడిన ఎంపీ బాబుల్ సుప్రియో నెల రోజుల తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.