Kerala: విదేశీ మహిళకు పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వివాదాస్పదమైన ఘటన..
- పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు నో ఎంట్రీ..
- ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం..
- తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా వినని సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలోకి ఒక విదేశీ మహిళను రానివ్వకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జాతీయతను సాకుగా చూపించి ఆమెను ఆలయ ప్రవేశం నిరాకరించారు. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, తాను హిందూ మాతాన్ని స్వీకరించానని చెప్పినప్పటికీ ఆమెను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం స్పందించారు. ‘‘ఎవరినైనా, తాము పూజించకుండా ఎందుకు నిరోధించాలి..?’’ అని ప్రశ్నించారు.
హర్‌ప్రీత్ అనే నెటిజన్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. పూర్తిగా సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఉన్న విదేశీ మహిళను ఆలయంలోకి అనుమతించలేదని వీడియోలో పేర్కొన్నారు. ఈ ఆలయంలోకి భారతీయులకు మాత్రమే అనుమతి ఉందని చెప్పి, ఆమెను గుడిలోకి అనుమతిచంలేదు. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నారని, తమకు నిశ్చితార్థం అయిందని, త్వరలోనే తాను భారతీయురాలిగా మారుతానని చెప్పనప్పటికీ, అధికారులు ఆమెను ఆలయ కార్యాలయానికి పంపారు. అక్కడి అధికారులు మాట్లాడుతూ, ఈ ఆలయంలోకి భారతీయులకు మాత్రమే ప్రవేశం ఉందని చెప్పారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
Read Also: Supreme Court: దారుణం..చేయని నేరానికి 11 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి..
ఈ వీడియోలో మహిళ తాను హిందువు అని చెప్పారు. అయితే, ఆలయ అధికారులు మాత్రం అందుకు సర్టిఫికేట్ సమర్పించాలని కోరారు. దీనికి ఆమె అన్ని వేళల సర్టిఫికేట్ తీసుకుని వెళ్లారా..? అని ప్రశ్నించడం వీడియోలో కనిపించింది. ఇది న్యాయమైన చర్య కాదని, తాను భారతయుడిని వివాహం చేసుకోబోతున్నానని, భగవద్గీతన చదివానని, అయినప్పటికీ సెక్యూరిటీ తనను నేరస్తురాలిగా చూశారని పేర్కొన్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు తాను చీరను ధరించానని చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింబది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందించారు. కొందరు మహిళ వాదనను సమర్థించగా, మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని కామెంట్స్ చేశారు.
‘‘మతం మరియు జాతీయతతో సంబంధం లేకుండా ఎవరైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించబడాలి. వారు దుస్తులు కోడ్, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతు మాత్రమే ఉండాలి’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దేవుడిని పూజించేందుకు వెళ్లిన ఈ జంటను అడ్డుకోవడం విచారకమని మరొకరు అన్నారు. ‘‘దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు కావు. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయం అనుమతించేది’’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు.
Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV
— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!