Site icon NTV Telugu

India Slams Mamdani: ‘‘మీ పని చూసుకోండి’’.. న్యూయార్క్ మేయర్ మమ్దానీపై భారత్ విమర్శలు..

Mamdani

Mamdani

India Slams Mamdani: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై భారత్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా మమ్దానీ లేఖ రాశారు. ఈ కేసులో ప్రస్తుతం, ఖలీద్ జైలులో ఉన్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, మమ్దానీ లేఖపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మమ్దానీ ఇతర ప్రజాస్వామ్య దేశాల న్యాయవ్యవస్థల పట్ల గౌరంగా ఉండాలని, తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Read Also: Child P*rn : చైల్డ్ పో*ర్న్ రాకెట్టు గుట్టు రట్టు.. తెలంగాణలో 24 మంది అరెస్ట్

గత నెలలో ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసినప్పుడు మమ్దానీ అతడికి మద్దతుగా లేఖలో సంఘీభావాన్ని తెలియజేశారు. “ప్రియమైన ఉమర్, చేదు గురించి నీ మాటలను నేను తరచుగా గుర్తు చేసుకుంటాను, అది మనల్ని ఆవరించకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తాను. మీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమందరం నీ గురించి ఆలోచిస్తున్నాము” మమ్దానీ లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ అల్లర్ల నిందితుడు ఖలీద్‌కు గతంలో కూడా మమ్దానీ మద్దతు ఇచ్చారు. న్యూ్యార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న సమయంలో, జూన్ 2023లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నాడు. ఖలీద్ అన్యాయంగా హింసించబడుతున్న స్కాలర్‌గా, మాజీ విద్యార్థి కార్యకర్తగా చెప్పారు. ఫిబ్రవరి 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఖలీద్ దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్నారు. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు అతనికి డిసెంబర్ 16 నుండి 29 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది.

Exit mobile version