Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!

  • ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయిల్ సీరియస్..
  • ఘటనకు వెనక ఎవరున్న వెంటాడి శిక్షిస్తామని హెచ్చరిక..
  • దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో హైజాక్ తరహా ఘటన..
  • సౌదీ అరేబియాలోని తబూక్‌లో సుక్షితంగా ల్యాండింగ్..
Flydubai Incident (1)

Flydubai Incident (1)

Flydubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో హైజాక్ తరహా ఘటన ఎదురైంది. కో-పైలట్, పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరకు ప్రయాణికులు కలుగజేసుకుని దాడి చేస్తున్న వ్యక్తిని నివారించారు. దీంతో సౌదీ అరేబియాలోని తబూక్ ‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని ప్రస్తుతం ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.

ఈ ఘటనపై ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికుల ఉంటే, ఇందులో 150 మంది ఇజ్రాయిల్ జాతీయులని తెలుస్తోంది. దీంతో దీనిని ఇజ్రాయిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఘటనపై ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిలీ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక దేశం లేదా ఒక ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నా బాధ్యత వహించాల్సిందే అని హెచ్చరించారు. ఇజ్రాయిల్ తన శత్రువుల్ని వెంబడించి నాశనం చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ మాట్లాడుతూ.. దీనిని ఉగ్రవాద ప్రయత్నంగా అభివర్ణిస్తూ.. ఇజ్రాయిల్ తన ప్రాంతీయ భద్రతా చర్యల్ని మరింత పెంచాలని అన్నారు.