Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flamingos Dead: ఎమిరేట్స్ విమానం ఢీకొట్టడంతో ముంబైలో సోమవారం 36 ఫ్లెమింగో పక్షలు చనిపోయాయి. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు పక్షుల గుంపును విమానం ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఘాట్‌కోపర్ ప్రాంతంలో చనిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు వన్యప్రాణుల బృందాన్ని అప్రమత్తం చేయడంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చనిపోయిన ఫ్లెమింగోలను స్వాధీనం చేసుకున్నారు.
పక్షుల కళేబరాలు పడి ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. విరిగిన రెక్కలు, గోళ్లు, ముక్కులు అన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి మరణానికి ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు కళేబరాలను శవపరీక్షలకు పంపినట్లు రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ (RAWW) వ్యవస్థాపకుడు పవన్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇది విచిత్రమైన ప్రమాదంలా కనిపించడం లేదని ప్రముఖ పర్యావరణవేత్త డి స్టాలిన్ అన్నారు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ముంబై ఎయిర్ పోర్టు వర్గాల ప్రకారం.. ఎమిరేట్స్ విమానం ఈకే 508 సోమవారం రాత్రి 9.18 గంటలకు పక్షుల్ని ఢీకొట్టినట్లు సమాచారం వచ్చిందని, ఆ తర్వాత సుక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై విమానయాన సంస్థ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ముంబై, నవీ ముంబై తీరం వెంబడి ఉన్న చిత్తడి నేలలు ఫ్లెమింగోలకు ఆవాసాలుగా ఉన్నాయి. వలస పక్షలు డిసెంబర్‌లో ఈ తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. మార్చి-ఏప్రిల్ వరకు కనిపిస్తుంటాయి.
తాజావార్తలు
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?