Uddhav Thackeray: మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ పార్టీ చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.
Read Also: Kishan Reddy: వరంగల్‌కు కిషన్ రెడ్డి.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి
ఇదిలా ఉంటే శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ముందుగా శివసేనను విచ్ఛిన్నం చేసిందని, ఇప్పుడు ఎన్సీపీని విడగొట్టిందని, తర్వాత మహారాష్ట్రను విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటోందని అన్నారు. బీజేపీ మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిపై దాడి చేసినందుకు అరెస్టయిన నలుగురు కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. బాంద్రా ఈస్ట్ లో పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూల్చివేడం వెనక బీఎంసీ హస్తం ఉండటంతోనే దాడి చేశారని ఆయన అన్నారు.
కూల్చివేత సమయంలో కార్యాలయం నుంచి పోస్టర్లు తీసేస్తామని కార్యకర్తలు పదేపదే చెబుతున్నప్పటికీ.. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే ఫోటోతో పాటు నిర్మాణాన్ని ధ్వంసం చేశారని శివసేన కార్యకర్తలు పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నలుగురు పార్టీ కార్యకర్తలను సత్కరిస్తూ..మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. శివసేన అంటే ఏమిటో మీరు చూపించారు. వారు బాలాసాహెబ్ ఫోటోను ధ్వంసం చేసిన రోజు నుంచే వారి పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు.
