NTV Telugu Site icon

Kunal Kamra: కమెడియన్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్

Kunalkamra

Kunalkamra

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థానే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడంటూ.. అతడు దేశద్రోహి అంటూ షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ‘ది హాబిటాట్ కామెడీ’ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా ‘దిల్ తో పాగల్ హై’ పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండేను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇదే షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్

ఇక కునాల్‌ కమ్రా వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రా సహా రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కునాల్.. పేమెంట్ కమెడియన్‌గా పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతోనే షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందంటూ శివసేన నేత ఆరోపించారు.

ఇది కూడా చదవండి: YS Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన!

కునాల్ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యానించాడని.. ఉద్దశ పూర్వకంగానే షిండేను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కామ్రా వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 నిబంధనల ప్రకారం అభ్యంతరకరమైనవి, చట్టవిరుద్ధమైనవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా షిండే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు అని ఫిర్యాదులో తెలిపాడు. ప్రజాప్రతినిధులపై నిర్మాణాత్మక విమర్శలు ఎప్పుడు స్వాగతిస్తామని.. అంతేకాని కించపరిచే, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. క్రిమినల్ నేరాలుగా పరిగణించాలని కోరారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కనల్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే క్లబ్‌పై దాడి చేసిన శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్ లోపల కుర్చీలు విసిరి, వస్తువులు పగలగట్టారు. అంతేకాకుండా కమెడియన్‌ను ఒక ఎంపీ బెదిరింపులకు పాల్పడ్డారు. దేశంలో ఎక్కడా తిరగనివ్వమన్నారు.

ఇక శివసేన కార్యకర్తల దౌర్జన్యంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఇక శివసేన కార్యకర్తలు చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కునాల్ వ్యంగ్య పాట రాశారని.. దానికి షిండే అభిమానులు క్లబ్‌ను ధ్వంసం చేయడం దారుణం అన్నారు.

ఇది కూడా చదవండి: Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌‌పై మండిపడిన నటి భార్గవి