NEET Fake OMR: నీట్లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Fake OMR: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో తనకు మంచి ర్యాంక్ వచ్చిందని పేర్కొంటూ నకిలీ ఓఎంఆర్‌ను దాఖలు చేసిన విద్యార్థినిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ ఓఎంఆర్ దాఖలు చేసినందుకు రూ. 20వేలు జరిమానా విధించింది. నీట్ యూజీ-2023లో మెడికల్ అభ్యర్థి దాఖలు చేసిన OMR షీట్‌ను తారుమారు చేసే ప్రయత్నంపై ఢిల్లీ హైకోర్టు మహిళా అభ్యర్థికి రూ. 20,000 జరిమానా విధించింది. ఓఎంఆర్ షీట్‌ను తారుమారు చేసేందుకు పిటిషనర్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కోర్టు పేర్కొంది. కోర్టులో ఇలాంటి ప్రయత్నాన్ని సహించలేమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థికి రూ.రెండు లక్షల జరిమానా విధిస్తూ పోలీసులకు అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె వయస్సు దృష్ట్యా అలా చేయడం మానుకున్నామని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ బెంచ్ పేర్కొంది.
Read Also: UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
కేసు విచారణ సందర్భంగా తాను సమర్పించిన ఓఎంఆర్ షీట్ అసలైనదని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కోర్టుకు చూపిన ఓఎంఆర్ షీట్ అసలైనది కాదని పట్టుబట్టిన పిటిషనర్ వైఖరి పట్ల దిగ్భ్రాంతి కలుగుతోందని కోర్టు పేర్కొంది. అధికారులు రూపొందించిన రికార్డు అధికారిక రికార్డు అని, దాని వాస్తవికతను అనుమానించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఎన్టీఏకు వ్యక్తిగత వాటా లేనందున అభ్యర్థి సాధించిన మార్కులను మారుస్తుందని నమ్మడానికి ఎటువంటి కారణం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను సమర్పించిన సందర్భంగా ఎన్టీఏ తరపు న్యాయవాది పిటిషనర్ చూపిన ఓఎంఆర్ షీట్‌ను తారుమారు చేసి, సవరించారని కోర్టుకు తెలిపారు. పరీక్షలో ఇచ్చిన సమాధానాలను ఉద్దేశపూర్వకంగా మార్చేశారు. మెరిట్ లిస్ట్‌లో తన పేరు అంతకుముందు కనిపించినప్పటికీ తర్వాత తొలగించబడిందన్న పిటిషనర్ వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషనర్ మరియు వారి తరపు న్యాయవాది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ చూసిన తర్వాత అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదని కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మెడికల్ అభ్యర్థి పిటిషన్‌పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో తనకు MBBS సీటును కేటాయించాలని అభ్యర్థించారు. తన మార్కులను మళ్లీ లెక్కించి, తాజా ఫలితాలు మరియు మెరిట్ జాబితా మరియు NEET (UG)-2023ని ప్రచురించాలని పిటిషనర్ ఎన్టీఏని కోరారు. జూన్ 13న NTA ఫలితాలను ప్రకటించిందని, కౌన్సెలింగ్‌లో తన ఆల్ ఇండియా ర్యాంక్ 351గా చూపబడిందని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం 720 మార్కులకు గాను 697 మార్కులు వచ్చాయని తెలిపారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) వెబ్సైట్లో ఆమె తదుపరి దశ నమోదుకు వెళ్లలేకపోయిందని పిటిషన్లో పేర్కొంది. తన మొత్తం మార్కులు 103కి పడిపోయాయని, ర్యాంక్ 351 నుంచి తగ్గి 12,530,32 పడిపోయిందని పిటిషనర్ తన ఫిర్యాదులో తెలిపారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!