DMK Against NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు వ్యతిరేకంగా పోరాటానికి తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సిద్ధమైంది. విద్యార్థులతోపాటు.. వారి తల్లీదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో నీట్‌కి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. రెండు రోజుల క్రితం నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని కొడుకు ఆత్మహత్య చేసుకోవడం.. తరువాత తండ్రి మరనించిన సంగతి తెలిసిందే. వారు ఇద్దరు మరణించిన సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి దీనికి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష కూటమి ఇండియా అధికారంలోకి రాగానే నీట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు కూడా.ఈ నేపథ్యంలోనే నీట్‌పై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది.
Read also: High Court: ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
పిల్లలతోపాటు వారి తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న నీట్‌కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. నీట్-2023లో విఫలమవడంతో ఇటీవల 17 ఏళ్ల జగదీశ్వరన్ మరియు అతని తండ్రి సెల్వ శేఖర్ మరణించడం నీట్ పిల్లలు మరియు తల్లిదండ్రులను ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టమవుతుందని డీఎంకే నేతలు చెబుతున్నారు. అధికార డీఎంకే నీట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. నీట్‌పై తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వైఖరికి నిరసనగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో నిర్వహించనున్న ‘ఎట్‌హోమ్’ వేడుకను తమిళనాడు ప్రభుత్వం బహిష్కరించింది. చెన్నైలోని గవర్నర్ హౌస్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి మాట్లాడుతూ.. ‘నీట్ మినహాయింపు బిల్లుపై నేను ఏ సమయంలోనూ సంతకం చేయను. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల విద్యార్థుల పోటీతత్వం ప్రశ్నార్థకం అవుతుంది. నీట్ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్న వార్త విని షాకియ్యానని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని వివిధ పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ సందర్భంలో, నీట్ పరీక్షను రద్దు చేయనందుకు కేంద్ర ప్రభుత్వం మరియు గవర్నర్ వైఖరిని డీఎంకే ఖండించింది. 20న నిరసన దీక్ష చేపడతామని ప్రకటించారు. తమిళనాడు అంతటా యువజన బృందం, విద్యార్థి బృందం, వైద్యబృందం తరపున ఆయా జిల్లాల రాజధానుల్లో భారీ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.