Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు. ఖనౌరీ, శంభు, రతన్‌పురా సరిహద్దుల్లో జరిగే నిరసన కార్యక్రమంలో వినేష్ ఫోగట్ పాల్గొనబోతుందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఇక, రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. తమ ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణచి వేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందన్నారు. మొదట మమ్మల్ని ఖలిస్తానీలు అని ట్యాగ్ వేశారు, అది పని చేయలేదన్నారు. ఇక, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
Read Also: Novak Djokovic: యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం.. జకోవిచ్ ఔట్! 18 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఆగస్టు 31వ తేదీ నాటికి 200 రోజుల ఉద్యమం పూర్తవుతోంది అని రైతు సంఘాల నాయుకుడు తెలిపారు. లక్షల మంది రైతులు తరలివస్తున్నారు.. మేము మా డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రాబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తానని సూచించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తమ తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బాలీవుడ్ నటి, పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు గతంలో వివాదానికి దారి తీయడంతో.. రైతు వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకతకు దారి తీసింది.
