Odisha: అందరికి అన్నంపెట్టి ఆకలి తీర్చే రైతన్న ఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన నమ్ముకున్న భూమిని అమ్ముకోలేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఉరితాడుకో.. పురుగుల మందుకో ప్రాణాలను అంకితమిస్తున్నారు చాలా మంది రైతులు. గతంలో రైతులు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మళ్ళీ వెలుగు చూసింది. పంట నష్టం రావడంతో ఓ రైతు ఉరివేసుకుని మరణించారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం లోని నయాగఢ్ జిల్లా లోని రాన్‌పూర్ బ్లాక్ చాంద్‌పూర్ ఠాణా లోని జాంకియా పంచాయితీ ఓస్ట్‌పాడ గ్రామంలో గోవింద్ సాహు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
Read also:MLA Lakshmareddy: అభివృద్ధిని వైపే మా అడుగు.. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
కాగా వ్యవసాయాన్ని నమ్ముకున్న గోవింద్ రెండు ఎకరాల పొలంలో వరిని సాగు చేస్తున్నాడు. తాజాగా పెట్టిన వరి పంటలో గోవింద్ కి తీవ్ర నష్టం వచ్చింది. ఈ క్రంలోలో పంట నష్టం తాళలేక ఈ రోజు ఉదయం పొలం లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. కాగా అటుగా వెళ్తున్న పక్క పొలం రైతులు గమనించి గోవింద్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.