NTV Telugu Site icon

Gita mehta passed away: ప్రముఖ రచయిత్రి గీతా మెహతా మృతి.. స్పందించిన మోడీ

Untitled 1

Untitled 1

Gita mehta: మరణించిన వాళ్ళు తిరిగి జన్మిస్తారు అనే విషయంలో ఎంత వాస్తవం ఉందొ తెలియదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మరణిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పుట్టుకకి మరణానికి మధ్య ఉన్న జీవితంలో ఎం సాధించాము అనేదాన్ని బట్టి మన పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది. అలా మరణించాక కూడా ఎవరి పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందో వాళ్ళే అమరులు. ఆ అమరుల జాబితాలోకి వస్తారు ప్రముఖ రచయిత్రి గీతా మెహతా.

Read alos:Ramabanam : ఓటీటీ లో దూసుకుపోతున్న రామబాణం మూవీ..

రచయిత్రి గీతా మెహతా ఢిల్లీ లో స్థిరపడ్డ ఓ ప్రముఖ ఒడియా కుటుంబంలో జన్మించారు. తండ్రి స్వాతంత్ర ఉద్యమకారుడు. ఈయన స్వాతంత్రం వచ్చాక ఒడిశా ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్ కూడా 2000 సంవత్సరం నుండి ఒడిశా ముఖ్యమంత్రి గా సేవలు అందిస్తున్నారు. ఇక గీతా మెహతా విషయానికి వస్తే ఈమె తన విద్యాభ్యాసం భారతదేశంలో మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం UK, యూరోపియన్ మరియు US టెలివిజన్ కోసం 14 డాక్యుమెంటరీలను నిర్మించారు. ఈమె రచించిన 21 పుస్తకాలు వివిధ భాషల్లోకి అనువదించబడినవి. పద్మశ్రీ పురస్కారానికి ఆమె పేరు ఎంపికైనది. కాగా రాజకీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆమె ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.

Read alos:Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..

కాగా శనివారం ఢిల్లీలో వృద్దాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పైన భారత ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత్రి గీతా మెహతా జీ తెలివి తేటలు వర్ణనాతీతం. ఆమె రచనలతో, చిత్ర నిర్మాణంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి గీతా మెహతా జి మరణం నన్ను ఎంతగానో బాధిస్తుంది అని సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేసారు. అలానే ఆమె ప్రకృతి మరియు నీటి సంరక్షణపై కూడా కృషి చేశారు. ఈ దుఃఖ సమయంలో నవీన్ పట్నాయక్ మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. అని సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేశారు