Ramabanam : ఓటీటీ లో దూసుకుపోతున్న రామబాణం మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో విడుదల అయిన కొన్ని సినిమాలు అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి.
తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలు ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో దాదాపు రూ.55 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
రొటీన్ కథ తో ఆకట్టుకొని కామెడీ తో ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది.రిలీజ్ కు ముందు మేకర్స్ ఈ సినిమా కోసం భారీ గా ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ మ్యాట్నీ షో లకే జనాలు లేక థియేటర్లు విలవిలలాడాయి. అలా ఈ సినిమా గోపి చంద్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల అయిన దాదాపు 4 నెలల పాటు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయితే కాలేదు..ఈ సినిమా థియేటర్ రిజల్ట్ చూసి డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసుకున్న వారు కూడా వెనకడుగేసే పరిస్థితి వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఓటీటీ లో మాత్రం ఊహించని రెస్పాన్స్ ను అందుకుంటుంది.అంతేకాదు ఈ వీక్ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ లో రామబాణం మూవీ నెంబర్ 1 గా నిలిచింది.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు