Site icon NTV Telugu

India at UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్.. పనికిమాలిన వ్యాఖ్యలంటూ భారత్ ఘాటు రిఫ్లై

Un

Un

India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Read Also: Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ మంగళవారం మాట్లాడుతూ.. పాక్ ఆరోపణలను నిరాధారమైన, రాజకీయ ప్రేరణ ఆరోపణలుగా పేర్కొన్నారు. ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు కొట్టిపాేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా అనర్హమైనదిగా ఆమె అన్నారు. భారత్ దృష్టి ఎల్లప్పుడు మహిళల, శాంతి, భద్రత ఎంజెడాపైనే ఉంటుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల మెజాంబిక్ ప్రెసిడెన్సీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాక్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎప్పుడు భారత భూభాగాలే అని.. భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయి, ఎల్లప్పుడు ఉంటాయని గతంలోనే భారత్ పలుమార్లు పాకిస్తాన్ కు చెప్పింది. పొరుగు దేశం అయిన పాకిస్తాన్ తో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటోందని అయితే, ఉగ్రవాదం లేని స్థితిలోనే ఇది సాధ్యం అని భారత్ స్పష్టం చేసింది. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ లోని బాలకోట్ జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని విమానాలతో ధ్వంసం చేసింది. అప్పటి నుంచి భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. 2019 ఆగస్ట్ లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా కట్ అయిపోయాయి.

Exit mobile version