దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబులు కలకలం సృష్టించాయి… ఈశాన్య ఢిల్లీ సీమాపురి ప్రాంతంలో ఐఈడీ బాంబు గుర్తించారు… ఎవరూ లేని ఓ అపార్టమెంట్ నుంచి పేలుడు పదార్ధాలున్న సంచిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. ఆ అపార్ట్మెంట్ యజమాని ఖాశిం అనే కాంట్రాక్టర్… ఇటీవలే ఖాశిం తండ్రి మరణించినట్లు సమాచారం.. ఇక, ఆ అపార్ట్మెంట్ను ముగ్గురు, నలుగురు యువకులకు ఖాశిం అద్దెకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం అద్దెకు దిన యువకులు పరారీలో ఉన్నట్టు చెబుతున్న పోలీసులు.. ఆ యువకులే అనుమానితులుగా భావిస్తున్నారు..
Read Also: Bajireddy: బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. కొట్టడమే కరెక్ట్..!
ఇక, అద్దెకున్న యువకుల ఫోన్ల సంభాషణలు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విన్నారని తెలుస్తోంది.. అనుమానం రావడంతో అపార్టమెంట్ను తనిఖీ చేసింది ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు టీమ్.. గత నెలలో తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ లో బాగా రద్దీగా ఉండే పూల మార్కెట్లో 3 కిలోలున్న ఆర్డీఎక్స్ లాంటి శక్తివంతమైన రసాయనాలున్న సంచి లభ్యమైన విషయం తెలిసిందే కాగా.. జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాద కుట్రగా అనుమానించారు పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దృష్టికి ఈ అపార్టమెంట్ వ్వవహారం వచ్చింది.. మొత్తంగా ఐఈడీ బాంబులు దేశ రాజధానిలో కలకలం రేపుతున్నాయి.