చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిని మహిళా కార్మికులు తిరుమలర్, తిరుమంజు, చెన్‌పాగం గా గుర్తించారు.
Also Read:Skoda Kodiaq: పవర్ ఫుల్ ఇంజిన్.. అదిరే ఫీచర్లతో లాంచ్‌కు రెడీ..
ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిర్వాహకులు అనుమతి లేకుండా టపాసులు తయారి చేస్తున్నట్టు సమాచారం. భద్రతను గాలికొదిలేసి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.