Site icon NTV Telugu

Arvinder Singh Lovely: బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ..

Arvinder Singh Lovely

Arvinder Singh Lovely

Arvinder Singh Lovely: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ రోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన తర్వాత లవ్లీ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరుపున పోరాడే అవకాశం లభించిందని, దేశంలో అఖండ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.

Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ జాడ కోసం సీబీఐ సాయం కోరిన కర్ణాటక..

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో లవ్లీ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

Exit mobile version