Site icon NTV Telugu

Kejriwal: మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్! ఆప్ అధ్యక్షుడికి ఏ బంగ్లా కేటాయించారంటే..!

Kejriwal3

Kejriwal3

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించారు. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి.. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. తాజాగా కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది.

ఇది కూడా చదవండి: Singer Maithili Thakur: మోడీచే ప్రశంసలు.. ఇప్పుడు బీహార్ బీజేపీ మంతనాలు.. మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

ఇక బంగ్లా కేటాయింపుల్లో భాగంగా కేజ్రీవాల్.. గతంలో మాయావతి నివాసం ఉన్న రోడ్డు నెంబర్ 35, లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించాలని కోరారు. కానీ ఆ బంగ్లాను ప్రస్తుతం వేరే కేంద్రమంత్రికి కేటాయించేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మరొక బంగ్లాలోకి వెళ్లాల్సి వచ్చింది.

దాదాపు ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని 95, లోధి ఎస్టేట్‌లోని టైప్ VII బంగ్లా కేటాయించారు. జాతీయ అధ్యక్షుడిగా తనకు బంగ్లా కేటాయించలేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బంగ్లా కేటాయించింది. ఈ బంగ్లా ఎదురుగానే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఉంటున్నారు. కేజ్రీవాల్ ఈ బంగ్లాలోకి మకాం మారిస్తే మాత్రం.. శశిథరూర్ పొరుగువాడు అవుతారు. ఇదిలా ఉంటే గతంలో మాయావతి నివాసం ఉన్న 35, లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. కానీ జూలైలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి ఈ బంగ్లా కేటాయించడంతో ఇప్పుడు కేజ్రీవాల్‌కు వేరే బంగ్లా కేటాయించాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం కేజ్రీవాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించిన 5వ నెంబర్ ఫిరోజ్‌షా రోడ్‌లోని ఇంట్లో బస చేస్తున్నారు. వాస్తవంగా జాతీయ పార్టీల అధ్యక్షులకు పద్ధతి ప్రకారం కేజ్రీవాల్‌కు పది రోజుల్లో అధికారిక వసతి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కానీ ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది. సోమవారమే కేజ్రీవాల్ బంగ్లాను పరిశీలించి వచ్చినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version