ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని డిసైడ్ అయింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం అందించనున్నారు. దీంతో 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్‌లో లబ్ధి పొందొచ్చు.
ఇది కూాడా చదవండి: Sundarakanda: ‘సుందరకాండ’లో సిధ్ శ్రీరామ్ పాడిన పాట విడుదల.. విన్నారా!
అలాగే హైడ్రో పవర్ కోసం రూ.121,471 కోట్లు కేటాయించింది. 31, 359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. అలాగే పీఎం ఈ డ్రైవ్ కోసం రూ.10,900 కోట్లు కేటాయించింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. టూవీలర్లు, త్రీ వీలర్లు, అంబులెన్స్‌లు, ట్రక్కుల కోసం డిసైడ్ చేసింది. అంతేకాకుండా 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
ఇది కూాడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్
పీఎం ఈ బస్, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం రూ.3,435 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం రూ.70,125 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుంది. మిషన్ మోసమ్ ( వాతావరణం) కోసం రూ.2,000 కోట్లు కేటాయించింది. దీని ద్వారా వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ అందించడం, నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ శాటిలైట్లను ఉపయోగించడం, హై పర్ఫామెన్స్ కంప్యూటర్ల వినియోగం కోసం వినియోగించనున్నారు.
ఇది కూాడా చదవండి: Nissan Magnite facelift: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. అక్టోబర్ 04న రిలీజ్..