Site icon NTV Telugu

PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..

Pm Modi

Pm Modi

PM Modi: పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్‌కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్‌కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Mohammed Shami: షమీ కూతురిని టార్గెట్ చేసిన మత పెద్దలు.. ఈసారి ఎందుకంటే..?

‘‘శాంతిని పెంపొదించే ప్రతీ ప్రయత్నానికి శత్రుత్వం, ద్రోహం ఎదురైంది. వారికి జ్ఞానం రావాలి. వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటానని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము’’ అని ప్రధాని అన్నారు. పాక్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తాను నమ్ముతున్నానని మోడీ అన్నారు. పాక్ ప్రజలు నిత్యం కలహాలు, అశాంతి, నిరంతర భయాల్లో జీవించడంలో అలసిపోయారు, అక్కడి అమాయకపు పిల్లలు కూడా చంపబడ్డారని, లెక్కలేనన్ని జీవితాలు నాశనమయ్యాయని ప్రధాని అన్నారు.

‘‘ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తాను చేసిన తొలి ప్రయత్నం సద్భావనకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఇది దౌత్యపరమైన చర్య. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు నేను అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పటి రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ చారిత్రాత్మక విషయాన్ని తన జ్ఞాపకాలలో అందంగా చిత్రీకరించారు’’ అని పీఎం మోడీ చెప్పారు. భారత విదేశాంగ విధానం ఎంత స్పష్టంగా నమ్మకంగా మారిందనే దానికి ఇది నిదర్శనమని, ఇది శాంతి, సారస్యానికి భారత్ చూపించే నిబద్ధత అని ప్రపంచాన్ని సందేశమిచ్చామని చెప్పారు.

Exit mobile version