Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న భారతీయులు ‘టీ’కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కొందరైతే భోజనం లేకపోయినా ఉండగలరేమో గానీ, టీ లేకుండా ఉండలేరు. అందుకే, దేశంలో గల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు, ఇందులోనూ ప్రత్యేకతలు కావాలని కోరుకుంటారు కదా! ఈ నేపథ్యంలోనే అసోంలో పభోజన్ గోల్డ్ టీని సిద్ధం చేశారు. ఇదొక ఆర్గానిన్ తేయాకు. అత్యంత అరుదైన రకం. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ఒక కిలో మాత్రమే పండించారు. ఆ కిలో తేయాకు అక్షరాల రూ. 1 లక్షకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
జోర్హాట్‌లోని వేలం కేంద్రంలో సోమవారం ఈ తేయాకు విక్రయం జరిగింది. అసోంకు చెందిన ‘ఎసాహ్ టీ’ బ్రాండ్ దీనిని రూ. 1 లక్షకు కొనుగోలు చేసినట్టు వేలం కేంద్రం అధికారి స్పష్టం చేశారు. ఈ టీ పొడితో తయారయ్యే టీ.. పసుపు రంగులో ప్రశాశవంతంగా ఉంటుంది. ఈ తేయాకుని కోసిన తర్వాత సహజసిద్ధంగానే బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఇది టీకి మంచి రుచిని కూడా అందిస్తుంది. ఈ తేయాకు కొనుగోలు చేసిన ఎసాహ్ టీ సీఈవో బిజిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అందించడానికి వీలుంటుందని తెలిపారు. అటు.. తాము కేవలం ఒక కిలో మాత్రమే ఈ తేయాకుని పండించామని పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ యజమాని రాఖీదత్తా చెప్పారు. ఇది రికార్డ్ స్థాయిలో అత్యధిక ధర పలకడం సంతోషంగా ఉందన్నారు.
Also Read
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..