S Jaishankar: పాకిస్తాన్‌తో చర్చలపై జైశంకర్ బిగ్ స్టేట్మెంట్..
- పాకిస్తాన్‌తో చర్చలు విషయంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ఆ దేశంలో చర్చించే కాలం ముగిసింది..
- ఎలాంటి చర్యలకైనా భారత్ స్పందిస్తుందని వార్నింగ్..
- పాక్‌లో ఉగ్రవాదం పరిశ్రమగా మారిందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని ఆయన అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఈ వారంలో భారత్‌పై ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
‘‘ ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించినంత వరకు, ఆర్టికల్ 370 పూర్తయింది. కాబట్టి, మేము పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాల గురించి ఆలోచించగలము అనేది సమస్య’’ అని ఈ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో భారత్ వ్యవహరించే తీరులో నిష్క్రియంగా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పదలుచుకున్నది ఏమిటంట, మనం నిష్క్రియంగా లేము, ఎదైనా సంఘటన ప్రతికూల లేదా సానుకూల దిశలో ఉన్నా కూడా మేము స్పందిస్తాము’’ అని అన్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
పాకిస్తాన్‌తో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న జైశంకర్ మరోసారి తన వాడీవేడి మాటలతో ఆ దేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరిచే విషయంలో ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని చెప్పారు. ఉగ్రవాదం ఆ దేశంలో పరిశ్రమగా మారింది, అలాంటి బెదిరింపులని సహించేది లేదనేది భారతదేశ ప్రస్తుత మానసిక స్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే , బంగ్లాదేశ్‌లో పరిస్థితులు, ఆదేశంలో హిందువులపై టార్గెటెడ్ దాడులను ఆయన ప్రస్తావించారు. పొరుగుదేశాలు ఎప్పటికీ తికమక పెట్టేవే అని, ఏ పొరుగు దేశంలో సవాళ్లు లేవో చెప్పాలంటూ ఆయన పరస్పర ఆసక్తి, సహకారం ఆవశ్యకతని నొక్కి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజుల మిగిలి ఉండటంతో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కీలక పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్సులు పాకిస్తాన్‌తో దౌత్యసంబంధాలు, చర్చల జరపాలని కోరుకుంటున్నాయి. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం గురించి తన మానిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు