ED Raids On Muda office: కర్ణాటకలో సంచలనం రేపుతున్న మూడా స్కాం కేసులో 12 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఈరోజు (శుక్రవారం) మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంపై సోదాలు చేస్తుంది. కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా ముడా సీనియర్ అధికారులతో సమావేశం అయింది. ఈ భేటీ తర్వాత కేసుకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. భూకేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అందరినీ ప్రశ్నించే అవకాశం ఉంది.
Read Also: Allu Arjun : పుష్ప – 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నిహితుడిగా భావిస్తున్న కె. మరిగౌడ ఆరోగ్య కారణాలతో ముడా చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక, రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన మరిగౌడ.. రాజకీయ ఒత్తిళ్లతో రిజైన్ చేశారన్న వాదనలను తోసిపుచ్చారు. అయితే, సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకే తాను రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Read Also: IND vs NZ 1st Test: 402 రన్స్‌కు న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్‌పై 356 పరుగుల ఆధిక్యం!
ఇక, సీఎం సిద్ధరామయ్య సతీమణికి చెందిన 3.16 ఎకరాల భూమిని మూడా స్వాధీనం చేసుకుంది. ఈ భూమికి బదులుగా ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను ఆమెకు కట్టబెట్టారని విపక్షాలు ఆరోపించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తి పథకం కింద మొత్తం 38,284 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. అయితే, ముఖ్యమంత్రి సతీమణి పేరున కేటాయించిన 14 స్థలాల్లో కుంభకోణం జరిగినట్లు సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లిందని అన్నారు. ఇక, ఈ వివాదంపై విచారణ చేసేందుకు రంగంలోకి ఈడీ అధికారులు దిగారు.