Site icon NTV Telugu

Mayawati: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి

Mayawati

Mayawati

బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అభ్యర్థులు గెలవకుండా నిరోధించడానికి, పార్టీపై దళిత ఓటర్ల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో బ్యాలెట్ ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

మాయావతి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపిరింగ్ చేయడం వల్లే బీఎస్సీ అభ్యర్థులు గెలవడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బ్యాలెట్ పత్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అది సాధ్యం కాదన్నారు. బీఎస్పీ మద్దతుదారులు నిరుత్సాహపడొద్దని భవిష్యత్ ఉందని సూచించారు. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై మాయావతి విమర్శలు గుప్పించారు. దళితుల సంక్షేమం మరియు సాధికారత గురించి ఆయనకు ఆందోళన ఉంటే.. ప్రత్యేక పార్టీని నడపడానికి బదులుగా బీఎస్పీలో చేరాలని సూచించారు. ఆజాద్ దళితులను విభజించి బీఎస్పిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిన్న పార్టీలుగా ఏర్పడి.. అనంతరం పెద్ద పార్టీలకు మద్దతు ఇస్తున్నారని.. దీంతో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Story Board: రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేవదా..? భూముల ధరలు పడిపోయాయి..? అసలు కారణాలేంటి?

Exit mobile version