దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు, పరిమిత సంఖ్యలోనే ర్యాలీలు, పాదయాత్రలు ఉండాలని ఆదేశించింది.
Read: Amazon: బంపర్ ఆఫర్… వారికి మాత్రమే…
ప్రచారం సమయాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే యూపీలో మొదటిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14 వ తేదీన రెండోదశ ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే.
