El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
- భారత్‌పై ఎల్ నినో పెను ప్రభావం..
- మార్చి నాటికి 55 వేల మరణాలు అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘‘ఎల్ నినో’’ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులు సంభవించబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఎల్ నినో భారతదేశంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. . క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన ‘ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 3.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకావం ఉందని హెచ్చరించింది. ఇందులో భారత్‌లో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య సుమారు 55,000 మంది ఉష్ణ సంబంధిత మరణాలు నమోదు కావచ్చని అంచనా వేసింది. వీటిలో అత్యధిక మరణాలు మార్చిలోనే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
సూపర్ ఎల్ నినో:
భూమిపై వాతావరణ పరిస్థితుల్ని తీవ్రంగా ప్రభావితం చేసే సహజ వాతావరణ దృగ్విషయాల్లో ఎల్ నినో ఒకటి. ఈ ఏడాది ఇది అసాధారణ స్థితికి చేరబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నాటికి భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.08 డిగ్రీల మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో నమోదైన ఎల్ నినోలతో పోలిస్తే ఇది అత్యధిక స్థాయి. దీంతో ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినోను ‘‘సూపర్ ఎల్ నినో’’గా అభివర్ణిస్తున్నారు. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా పెరిగితే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరద ముప్పు కలుగవచ్చు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ ఏడాది ఎల్ నినో 1950 తర్వాత అత్యంత బలమైనదిగా మారింది. డిసెంబర్లో ఎల్ నినో ఎఫెక్ట్ గరిష్ట స్థాయికి చేరవచ్చు.
Also Read
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
- Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
- Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
- ‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
భారత్ లోనే అత్యధిక మరణాలు..
క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన ఎల్ నినో హీట్ మోర్టాలిటీ ట్రాకర్ ప్రకారం.. భారత్ లాంటి గ్లోబల్ సౌత్ దేశాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అక్టోబర్ నుంచి మార్చి వరకు భారత్‌లో సుమారు 55 వేల మరణాలు సంభవించొచ్చని అంచనా వేసింది. నైజీరియాలో 56 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయాసియాలో కూడా ఎల్ నినో ప్రభావం గణనీయంగా ఉంటుందని చెప్పింది. ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్లో 19 వేల మంది ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల మరణించొచ్చు.
ఎల్ నినో అంటే ఏమిటి..?
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే వాతావరణ దృగ్విషయాన్ని ఎల్ నినో అంటారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వాతావరణ పీడనం, వర్షపాతం నమోదులో మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ప్రతీ 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి ఎల్ నినో ఏర్పడుతుంది. ఇది సుమారు 9 నుంచి 12 నెలల పాటు కొనసాగవచ్చు. దీనికి సరిగా వ్యతిరేకంగా జరిగే వాతావరణ దృగ్విషయాన్ని ‘‘లా నినా’’ అని పిలుస్తారు. ఇది ఏర్పడినప్పుడు సమృద్ధిగా వర్షపాతం నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి.
తాజావార్తలు
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..