Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాపిక్ కాబోతున్నారా?
- మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ
- మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
- జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మరో ఎత్తుగడ వేస్తున్నారా? మళ్లీ ఉద్ధవ్‌కు ఎసరు పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శివసేనకు చెందిన ఒక నేత మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో షిండే మరో భారీ దెబ్బ కొట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడుగురు ఉద్ధవ్ థాక్రే ఎంపీలు.. షిండే శిబిరంలో చేరవచ్చని తెలుస్తోంది. శివసేన (యూబీటీ)కి చెందిన ఏడుగురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని.. తమతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నారని.. అలాగే ఎమ్మెల్యేల్లో 16 మంది కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే తెలిపారు. ‘ఆపరేషన్ టైగర్’ కింద ఏడుగురు శివసేన (యూబీటీ) లోక్‌సభ ఎంపీల చర్చలు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వారంతా షిండేతో కలవనున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
శివసేన అంచనాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వైపు ఫిరాయించే అవకాశం ఉందని… ఒకవేళ ఈ పరిణామం కార్యరూపం దాల్చితే.. అది లోక్‌సభలో ఎన్డీఏ బలాన్ని మరింత పెంచుతుంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఈ పరిణామం చోటుచేసుకుంటుందని శివసేన ఎమ్మెల్సీ సూచించారు.
గతంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే చీల్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఉద్ధశ్ థాక్రే భారీ దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!