National Herald Case: వరుసగా మూడో రోజు.. నేడు కూడా విచారణకు రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు, వందలమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీల కుటుంబం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కుట్ర పన్నిందని.. అందులో భాగంగానే ఈడీపై ఒత్తిడి తెచ్చి బూటకపు కేసులో సోనియాగాంధీ, రాహుల్‌లకు సమన్లు జారీ చేయించిందని హస్తం పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలను కమలదళం తిప్పికొట్టింది. తమ నాయకులు చట్టానికి అతీతులన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించింది.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
నగదు అక్రమ చలామణి వంటి బూటకపు కేసులు పెట్టడం ద్వారా గాంధీల కుటుంబాన్ని అపఖ్యాతి పాలుచేయడానికి, ఆ కుటుంబంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి భాజపా కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. హిందూత్వం పేరుతో దేశంలో కమలదళం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందనీ విమర్శించింది. రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన తెలపాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!