గత వారం కోల్‌కతాలో ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ ఊహించని రీతిలో దాడి చేసింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల వార్తలు వినగానే వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అమిత్ షా దుర్మార్డుడు.. నీచుడు’’ అంటూ మండిపడ్డారు. తాను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు
తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 8న ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయాల్లో జరిగిన ఈడీ దాడులు అడ్డుకున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేశారని.. డిజిటల్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. దాదాపు రూ.2,742 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోందని.. హవాలా ద్వారా రూ.20 కోట్లు ఐ-ప్యాక్ అందుకుందని ఆరోపించింది. మమతా బెనర్జీ 200 మంది పోలీసులతో ప్రతీక్ జైన్ నివాసానికి వచ్చి ఈడీ అధికారులను అడ్డుకున్నారని తెలిపింది. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్ ఫోన్లు, పత్రాలను బలవంతంగా తీసుకెళ్లి 2 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని ఈడీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
అధికారులను బెదిరించడమే కాకుండా దర్యాప్తునకు పూర్తి ఆటంకం కలిగించారని చెప్పింది. ప్రస్తుతం ఈడీ అధికారులపై దాఖలైన ఎఫ్ఐఆర్‌పై స్టే విధించాలని కోరింది. ప్రతీకార చర్యలకు దిగితే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే డిజిటల్ పరికరాలను సీల్ చేయడం లేదా ఫోరెన్సిక్‌లో భద్రపరచాలని కోరింది.
