NTV Telugu Site icon

Priyanka Gandhi: నవంబర్ 13న వయనాడ్ బైపోల్.. బరిలోకి దిగుతున్న ప్రియాంకాగాంధీ

Priyankagandhi1

Priyankagandhi1

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వాయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న జరగనుంది.

ఇది కూడా చదవండి: Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?

వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని జూన్‌లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. దీంతో వయవాడ్‌ బైపోల్‌కు మంగళవారం ఈసీ షెడ్యూల్ వెల్లడించారు. నవంబర్ 13న పోలింగ్ జరగగా.. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతోందా..?

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా మంగళవారం ఎన్నికల సంఘం ఉపఎన్నికలు ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఇక జార్ఖండ్‌లో రెండు విడతల్లో నవంబర్ 13, 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి:Whatsapp accounts: భారీగా వాట్సప్ ఖాతాలపై నిషేధం.. 84 లక్షల అకౌంట్స్ క్లోజ్