Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Eam Jaishankar Comments On Pakistan

EAM Jaishankar: ఇండియా ఐటీలో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ వేరే రకం “ఐటీ”లో ఎక్స్‌పర్ట్

Published Date :October 1, 2022 , 10:39 pm
By BV Reddy
EAM Jaishankar: ఇండియా ఐటీలో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ వేరే రకం “ఐటీ”లో ఎక్స్‌పర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్‌పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలు ఒత్తడిలో ఉన్నాయని ఆయన అన్నారు.

భారతదేశంపై తీవ్రవాదం కొన్ని ఏళ్లుగా కొనసాగుతోందని.. అయితే దీని గురించి ప్రపంచానికి వివరించడంలో భారత్ విజయవంతం అయిందని ఆయన అన్నారు. ఇటీవల అమెరికాలో పాకిస్తాన్ గురించి జైశంకర్ ఇదే రకంగా స్పందించారు. అమెరికా, పాకిస్తాన్ కు ఎఫ్-16 విమానాల డీల్ పై ఆయన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మొహం మీదే ‘మీరు ఎవరిని ఫూల్స్ చేయలేరు’ అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. పాకిస్తాక్ కు ఎఫ్ -16 ఇస్తే ఏం చేస్తుందో అందరికి తెలుసని ఆయన అన్నారు.

Read Also: Megastar Chiranjeevi: దండేసి గొర్రె పొట్టెల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారు

ఇదిలా ఉంటే పాకిస్తాన్ కు ఇస్తున్న సాయం కేవలం ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకే అని అమెరికా చెబుతోంది. అయితే ఇది భారత్ కు వ్యతిరేకంగా కాదని అంటోంది. పాకిస్తాన్, అమెరికా సంబంధాల వల్ల ఇరు దేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండని జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా పాలసీలను రూపొందిస్తున్న వారితో మాట్లాడాల్సి వస్తే ఇది మీకు ఎంత మాత్రం ప్రయోజనం కానది చెబుతా అని.. జైశంకర్ అన్నారు.

ఇదిలా ఉంటే గతంలో కూడా ఉగ్రవాదం పేరుతో పాకిస్తాన్, అమెరికా నుంచి భారీగా నిధులను సేకరించింది. అయితే అది ఉగ్రవాదానికి వ్యతిరేకం కన్నా.. భారత్ వ్యతిరేకతకే ఎక్కువగా ఉపయోగించుకుంది. గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో పాకిస్తాన్ కు ఇస్తున్న 200కోట్ల డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపివేసింది. అయితే మళ్లీ జోబైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత పాకిస్తాన్ తో సంబంధాలు పునరుద్ధరించుకుంటుంది అమెరికా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EAM Jaishankar
  • EAM Jaishankar comments on Pakistan
  • f-16 deal
  • Pakistan
  • USA

తాజావార్తలు

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

  • Petrol-Diesel Crisis: యుద్ధంతో చమురు సంక్షోభం.. ఈ దేశాల్లో ప్రభుత్వోద్యోగులకు సెలవులు, ఆంక్షలు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions