BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘన విజయం..
- సౌండ్ వినిపించలేదు కానీ, ధమాకా వినిపించింది..
- రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాలుగు కీలక పదవుల్లో మూడింటిని గెలుచుకున్న తర్వాత బీజేపీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘‘ఛాత్రోంకీ గుంజ్’’( విద్యార్థి ప్రతిధ్వని)ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇండోర్‌లో విద్యార్థి కార్యక్రమంలో ఉన్న సమయంలోనే శనివారం ఈ ఫలితాలు వెలువడ్డాయి.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘గూంజ్ (ప్రతిధ్వని) అయితే వినిపించలేదు.. కానీ ధమాకా (పేలుడు) మాత్రం ఖచ్చితంగా వినిపించింది’’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విజయంపై ABVPకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ABVP సిద్ధాంతం, ‘‘నేషన్ ఫస్ట్’’ భావజాలంపై ఉన్న నమ్మకనాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాదో జోషి కూడా ABVP అభ్యర్థులకు అభినందనలు తెలియాజేశారు. మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ‘‘యువత గొంతు స్పష్టంగా వినిపిస్తోంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read
కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI ఒక్క స్థానంలో గెలవలేదు. అధ్యక్ష పదవిలో ABVP అభ్యర్థి యశ్ దబాస్, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన NSUI అభ్యర్థి విజయ్ శంకర్ మీనాను ఓడించారు. దబాస్కు 24,576 ఓట్లు రాగా, మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి. దీంతో దబాస్ 2,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుపొందారు. సెక్రటరీ, వైస్ సెక్రటరీ పదవుల్ని ఏబీవీపీకి చెందిన రియా ఛావ్డీ, లక్ష్యరాజ్ సింగ్ గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!