పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్లో ఒడిశాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అర్ధరాత్రి విద్యార్థినులు ఎందుకు బయటకు వెళ్తున్నారని.. ప్రైవేటు యాజమాన్యాలు శ్రద్ధ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!
మమత వ్యాఖ్యలను సోమవారం బాధితురాలి తండ్రి తప్పుపట్టారు. మమతా బెనర్జీ కూడా ఒక మహిళనే కదా? ఎందుకు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మహిళలు ఉద్యోగాలు వదిలి ఇంట్లోనే కూర్చోవాలా?, బెంగాల్ ఔరంగజేబు పాలనలో ఉందా? అని నిలదీశారు. బెంగాల్లో భద్రత లేనప్పుడు ఒడిశాకు తీసుకెళ్లిపోతానని.. తన కుమార్తెకు భద్రత ముఖ్యమని.. కెరీరే తర్వాత అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!
తాజాగా బుధవారం మరొకసారి బాధిత తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మమతకు క్షమాపణ చెప్పారు. మమతా బెనర్జీ తల్లిలాంటిది అన్నారు. తాను తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించాలని కోరారు. ఆమె పాదాలకు లెక్కలేనన్నీ నమస్కారాలు చేస్తున్నా.. తన కూతురికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాను.. అయినా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఒడిశాకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దుర్గాపూర్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న ఆహారం కోసం అని స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. అనంతరం దుండగులు బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. స్నేహితుడితో పాటు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.