IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు
- రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- 194 మంది ప్రయాణికులు సురక్షితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో సోమవారం అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానంలో మంటలు కనిపించడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లు చేశారు. పైలట్ అప్రమత్తతతో విమానం సురక్షితంగా రాజ్‌కోట్ విమానాశ్రయంలో దిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో విమానంలో ఉన్న 194 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలో పొగ కనిపించడంతో పైలట్ వెంటనే రాజ్‌కోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు వెంటనే రన్‌వేను సిద్ధం చేసి విమానాన్ని సురక్షితంగా దించారు. రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇటీవలి నెలల్లో ఇండిగో విమానానికి సంబంధించి ఇది రెండో అత్యవసర ఘటన కావడం గమనార్హం.
Also Read
- Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
- Energy Crisis: భారత్‌లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక పదవి? పార్లమెంట్ దగ్గర కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
గత మే నెలలో హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్లిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలడంతో క్యాబిన్లో పొగ వ్యాపించింది. ఆ సమయంలో విమానం షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయి పార్కింగ్ బే వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ.. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోవడంతో అత్యవసరంగా ఇన్ఫ్లేటబుల్ స్లైడ్ల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించారు. ఆ ఘటనలో ఒక ప్రయాణికుడు స్వల్పంగా గాయపడగా.. మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో పొగ రావడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
-
TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
-
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్‌పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!