Site icon NTV Telugu

Dowry ban: ఆ ఊళ్లో వరకట్నం నిషేధం..

Dowry Ban

Dowry Ban

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అన్నారు పెద్దలు.. అంటే.. జీవితంలో కీలకమైన ఘట్టాలే కాదు.. ఖర్చుతో కూడుకున్న పని కూడా.. ఇక, ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు అనేలా ఉంది పరిస్థితి.. పెరిగిపోయిన ఖర్చులకు తోడు వరకట్నాలు ఓ ఆడపిల్ల తల్లికి భారంగా మారిపోయాయి.. ఉన్నది ఏదో అమ్మితే తప్ప.. కూతుళ్ల పెళ్లి చేయలేని పరిస్థితులు వచ్చాయి.. వరకట్నం చట్టరిత్యా నేరం అయినా.. అదిలేకుండా పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.. ఇలాంటి సమయంలో ఆదర్శంగా నిలుస్తోంది ఓ గ్రామం.. వరకట్నం ఇవ్వడంతో పాటు తీసుకోవడంపై కూడా నిషేధాన్ని విధించింది.

Read Also: Bandi Sanjay: కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?

వరకట్నం నిషేధించిన ఆ గ్రామం వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ గిరిధ్​లోని బర్వాదీ గ్రామస్థులు రెండేళ్ల క్రితం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కట్నం ఇవ్వడంతో పాటు.. తీసుకోవడాన్ని కూడా నిషేధిస్తూ తీర్మానం చేశారు. బర్వాదీ అంజుమన్ కమిటీ ఈ మేరం తీర్మానం చేసింది.. ఈ నిర్ణయంపై ప్రశంసలు రాగా.. ఇప్పటివరకు కులం, మతం అనే తేడా లేకుండా.. రెండు వందలకు పైగా పెళ్లిళ్లు కట్నం లేకుండానే జరిగాయట.. బర్వాదీ గ్రామ పంచాయతీ ఈ కొత్త ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.. మొదటల్లో ఈ నిర్ణయానికి అంత స్పందన లేకున్నా.. క్రమంగా.. కట్నం లేకుండా పెళ్లి చేసేవాళ్లు పెరిగిపోయినట్టు బర్వాదీ అంజుమన్ కమిటీకి చెందిన సదర్ లాల్ మహ్మద్ అన్సారీ వెల్లడించారు.

కట్నంపై తీర్మానం చేసిన తర్వాత ఆ గ్రామం కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంది.. పైకి కట్నం ఇవ్వడంలేదు.. తీసుకోవడం లేదు అని చెబుతూనే.. కొంతమంది రహస్యంగా కట్నం తీసుకొని వివాహ తంతు పూర్తి చేసేశారు.. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ గ్రామం.. కట్నం తీసుకున్న కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.. ఆ తర్వాత గ్రామస్థులంతా ఈ నిబంధనకు క్రమంగా అలవాటు పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

Exit mobile version