Dowry ban: ఆ ఊళ్లో వరకట్నం నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అన్నారు పెద్దలు.. అంటే.. జీవితంలో కీలకమైన ఘట్టాలే కాదు.. ఖర్చుతో కూడుకున్న పని కూడా.. ఇక, ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు అనేలా ఉంది పరిస్థితి.. పెరిగిపోయిన ఖర్చులకు తోడు వరకట్నాలు ఓ ఆడపిల్ల తల్లికి భారంగా మారిపోయాయి.. ఉన్నది ఏదో అమ్మితే తప్ప.. కూతుళ్ల పెళ్లి చేయలేని పరిస్థితులు వచ్చాయి.. వరకట్నం చట్టరిత్యా నేరం అయినా.. అదిలేకుండా పెళ్లిళ్లు మాత్రం జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.. ఇలాంటి సమయంలో ఆదర్శంగా నిలుస్తోంది ఓ గ్రామం.. వరకట్నం ఇవ్వడంతో పాటు తీసుకోవడంపై కూడా నిషేధాన్ని విధించింది.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
వరకట్నం నిషేధించిన ఆ గ్రామం వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ గిరిధ్‌లోని బర్వాదీ గ్రామస్థులు రెండేళ్ల క్రితం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కట్నం ఇవ్వడంతో పాటు.. తీసుకోవడాన్ని కూడా నిషేధిస్తూ తీర్మానం చేశారు. బర్వాదీ అంజుమన్ కమిటీ ఈ మేరం తీర్మానం చేసింది.. ఈ నిర్ణయంపై ప్రశంసలు రాగా.. ఇప్పటివరకు కులం, మతం అనే తేడా లేకుండా.. రెండు వందలకు పైగా పెళ్లిళ్లు కట్నం లేకుండానే జరిగాయట.. బర్వాదీ గ్రామ పంచాయతీ ఈ కొత్త ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.. మొదటల్లో ఈ నిర్ణయానికి అంత స్పందన లేకున్నా.. క్రమంగా.. కట్నం లేకుండా పెళ్లి చేసేవాళ్లు పెరిగిపోయినట్టు బర్వాదీ అంజుమన్ కమిటీకి చెందిన సదర్ లాల్ మహ్మద్ అన్సారీ వెల్లడించారు.
కట్నంపై తీర్మానం చేసిన తర్వాత ఆ గ్రామం కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంది.. పైకి కట్నం ఇవ్వడంలేదు.. తీసుకోవడం లేదు అని చెబుతూనే.. కొంతమంది రహస్యంగా కట్నం తీసుకొని వివాహ తంతు పూర్తి చేసేశారు.. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ గ్రామం.. కట్నం తీసుకున్న కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.. ఆ తర్వాత గ్రామస్థులంతా ఈ నిబంధనకు క్రమంగా అలవాటు పడినట్టు స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?