NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్‌కి అవినీతిలో ‘‘పీహెచ్‌డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్, దాని కూటమి మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. మంగళవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిలో కాంగ్రెస్ కూటమికి ‘‘డబుల్ పీహెచ్‌డీ’’ విమర్శించారు. చిమూర్‌లో జరిగిన సభకు హాజరైన మోడీ బీజేపీ మహాయుతి అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, దారి మళ్లించడంలో కాంగ్రెస్‌ వాళ్లకు డబుల్ పీహెచ్‌డీ ఉందని, 2.5 ఏళ్లలో మెట్రో నుంచి వధ్వన్‌ పోర్టు, సమృద్ధి మహామార్గ్‌ వరకు ప్రతి అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేశారని అన్నారు. అఘాడీ అంటే అవినీతిలో అతిపెద్ద ఆటగాడు అని గుర్తుంచుకోండని చెప్పారు.

Read Also: China: చైనాలో అమానుష ఘటన.. కార్‌ ఢీకొట్టి 35 మంది మృతి..

దేశాన్ని వెనక్కి నెట్టి, బలహీన పరిచేందుకు ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్, దాని కూటమి వదలడం లేదని దుయ్యబట్టారు. మహారాష్ట్ర భారీ మెజారిటీలో మహాయుతి కూటమి గెలుస్తుందని హాజరైన జనాలే సాక్ష్యమని చెప్పారు. మహాయుతి మహారాష్ట్రలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. గడ్చిరోలితో పాటు దేశవ్యాప్తంగా మావోయిజాన్ని కట్టడి చేశామని అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దశాబ్దాలుగా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదంలో మండిపోతోంది. మాతృభూమిని కాపాడుతూ మహారాష్ట్రకు చెందిన ఎందరో వీర జవాన్లు జమ్మూకశ్మీర్ గడ్డపై వీరమరణం పొందారు. ఇదంతా జరిగిన ఆర్టికల్ 370 ముసుగులో జరిగింది. ఈ ఆర్టికల్ మేము ఆర్టికల్ 370ని రద్దు చేసాము. కాశ్మీర్ భారతదేశం, భారత రాజ్యాంగంతో పూర్తిగా విలీనం చేయబడింది, కశ్మీర్‌లో మళ్లీ ఆర్టికల్‌ 370ని పాక్‌ కోరుకున్నట్లే తీసుకురావాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. ఆదివాసీలను వివిధ కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ‘కుట్ర’ పన్నుతుందని ప్రధాని హెచ్చరించారు.

Show comments