Donald Trump’s 2020 India Visit: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను అధికారంలో ఉన్నప్పుడు 2020లో మొదటిసారిగా ఇండియాలో సందర్శించారు. దాదాపుగా 36 గంటల పాటు ఇండియాలో గడిపారు ట్రంప్. ట్రంప్ తో పాటు ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ అయిన మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్లతో పాటు అమెరికా ఉన్నతాధికారులు ఇండియాలో పర్యటించారు. 2020 ఫిబ్రవరి 24-25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో ట్రంప్ పర్యటన సాగింది.
2020, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో మూడు గంటల పాటు డొనాల్డ్ ట్రంప్ పర్యటించారు. దాదాపుగా 22 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో పాటు సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో‘ నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. రెండు దేశాల మధ్య సంబంధాలపై ఇరు నేతలు మాట్లాడారు. అమెరికా- ఇండియా మధ్య ట్రేడ్ డీల్ పై ప్రకటన ఉంటుందని అనుకున్నా.. ఆ దిశగా ట్రంప్ ఎలాంటి కీలక ప్రకటన చేయలేదు. ఈ కార్యక్రమం అనంతరం ఆగ్రా తాజ్ మహల్ పర్యటనకు వెళ్లారు ట్రంప్. ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
Read Also: Putta Madhu Challenge: నాపై ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా!
అయితే తాజగా మిషాల్ భతేనా అనే వ్యక్తి ట్రంప్ పర్యటనకు అయిన ఖర్చులను వెల్లడించాలని సమాచార హక్కు చట్టం కింద కోరారు. అక్టోబర్ 24, 2020న దీని కోసం దరఖాస్తు చేసిన మిషాల్ కు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆయన మొదటి అప్పీల్ చేయడంతో పాటు ఆర్టీఐ అత్యున్నత అప్పీలేట్ అథారిటీ కమిషన్ ను ఆశ్రయించారు. ట్రంప్ బోజనం, రవానా, విమానాలు, గెస్ట్ హౌజులు మొదలైన వాటి వివరాలను తాజాగా ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 24-25, 2020లో ట్రంప్ పర్యటనకు రూ. 38,00,000 ఖర్చు అయినట్లు వివరాలు వెల్లడించింది.