Site icon NTV Telugu

Donald Trump: సుంకాల విషయంలో భారత్‌కి ట్రంప్ వార్నింగ్..

Donald Trump

Donald Trump

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను ‘‘అత్యంత సుంకాల తయారీదారులు’’గా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, ఆమెరికాని మొదటిస్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై అలా జరగనవ్వబోము అని ప్రకటించారు.

Read Also: DeepSeek: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనా ? డీప్ సీక్ జవాబు ఇదే !

ఫ్లోరిడాలో జరిగిన రిట్రీట్‌లో హౌస్ రిపబ్లికన్లతో మాట్లాడుతూ, బ్రిక్స్‌లో భాగంగా ఉన్న మూడు దేశాలు తమతమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా్యని, కానీ అవి మనకు హాని కలిగించేవిగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. మేము బయటి దేశాలపై ముఖ్యంగా హాని కలిగించే దేశాలపై సుంకాలు విధించబోతున్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా సందర్శించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన కొన్ని సమయానికే ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

సుంకాల విషయంలో భారత్‌ని అతిపెద్ద దుర్వినియోగదారుడిగా ట్రంప్ పలు సందర్భాల్లో ఆరోపించారు. భారత్‌కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సుంకాలను తప్పించుకోవాలంటే, భారత్, బ్రెజిల్, చైనాలు లేదా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలో తమ వ్యాపారాలను నెలకొల్పాలని ట్రంప్ సూచించారు.

Exit mobile version