NTV Telugu Site icon

Donald Trump: భారత్‌ అత్యధికంగా ట్యాక్స్ విధిస్తోంది.. చైనా, బ్రెజిల్‌లో కూడా..!

Trump

Trump

Donald Trump: అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యగార్ధి కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మరోసారి భారత్‌ ‘సుంకాల’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను భారత్‌ విధిస్తోందని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తుంది.. బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు.

Read Also: PAK vs ENG: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ సంచలనం.. ఈ శతాబ్దంలో మొదటిసారి!

అయితే, బుధవారం నాటి సభలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్ గురువారం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడీని అత్యంత మంచి మనిషి, భారతదేశానికి గొప్ప నాయకుడు, నా ప్రియమైన స్నేహితుడు అని ఆయన అభివర్ణించారు. కానీ, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది.