NTV Telugu Site icon

Chennai: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య

Chennai

Chennai

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ బాలమురుగన్.. చెన్నైలోని అన్నా నగర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలో పలుచోట్ల అల్ట్రాసౌండ్ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఇక డాక్టర్ భార్య సుమతి.. న్యాయవాదిగా ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు నీట్ అభ్యర్థి జస్వంత్ కుమార్. రెండో కుమారుడు 11వ తరగతి విద్యార్థి లింగేష్ కుమార్.

ఇది కూడా చదవండి: Ranya Rao: వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. భలే కట్టుకథ అల్లిందే?

అయితే బాలమురుగన్.. అల్ట్రాసౌండ్ కేంద్రాలు నిర్వహించేందుకు భారీగా అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. తీర్చే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యంగా భావించారు. అంతే గురువారం ఉదయం కారు డ్రైవర్ ఇంటికి వచ్చేటప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డోర్ బద్దలు కొట్టి చూడగా నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించారు. పిల్లలు ఇద్దరూ వేర్వేరు గదుల్లో వేలాడుతూ కనిపించారు.

ఇది కూడా చదవండి: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌‌‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్

మ‌ృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనేది తెలియలేదు. అయితే డాక్టర్ ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Congress: స్పీకర్ ను అవమానపరిచినందుకు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..