Doctor Removes 1,364 stones from Gall bladder: కోల్కతా వైద్య కళాశాల వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 45 గంటలపాటు దీని కోసం శ్రమించారు. ఓ వృద్ధుడి పిత్తాశయం నుంచి 1,364 రాళ్లను తొలగించారు. వివరాల ప్రకారం మేదినీపుర్ జిల్లాకు చెందిన అశోక్ గుచైత్ గత కొద్దిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఎంతకి తగ్గకపోవడంతో చాలామంది వైద్యులను సంప్రదించారు. చివరిగా కోల్కతా వైద్య కళాశాలకు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయన పిత్తాశయంలో రాళ్లను గుర్తించారు. అశోక్ గుచైత్కు సెప్టెంబర్ 8న శస్త్రచికిత్స జరిగింది. 45 గంటల పాటు శ్రమించి వైద్యం చేశారు.
Also Read: RBI New Order: బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్.. కస్టమర్లకు ఆ పత్రాలు ఇవ్వడం లేట్ అయితే జరిమానా
ఈ ఆపరేషన్ కు హెడ్ గా వ్యవహరించిన డాక్టర్ శివజ్యోతి ఘోష్ మాట్లాడుతూ ఆశోక్ కు కిడ్నీ, డయాబెటిస్, రక్తపోటు సమస్యల ఉన్నాయని తెలిపారు. ఇన్ని ఆరోగ్య సమస్యలతో అతనికి చికిత్స చేయడం కొంచెం కష్టమే అని పేర్కొన్నారు. ఒకవేళ పిత్తవాహికలోకి రాళ్లు ప్రవేశించి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే మొత్తానికి వారి టీం విజయవంతంగా ఆపరేషన్ చేశామని, ఇప్పుడు రోగి పరిస్థితి కూడా బాగుందని పేర్కొ్న్నారు. ఆయనను డిశార్జ్ చేసినట్లు తెలిపారు. వైద్యుల ప్రకారం పిత్తాశయంలో ఏర్పడిన ఒక పెద్ద రాయి నుంచి చిన్న చిన్న రాళ్లు ఏర్పడతాయన్నారు. మనుషుల శారీరక స్థితి ఆధారంగా ఆ రాళ్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఉపవాసం ఉండటం, మోనోపాస్ సమయంలో ఇలాంటి రాళ్లు అభివృద్ధి చెందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రమాదం ఉండదని తెలుస్తుంది.