CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay vs DMK: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే వివాదం మరో కీలక మలుపు తిరిగింది. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఆత్తూరు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జూన్ 20న తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక పార్టీ బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఆ సమయంలో తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ హావభావాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. “తాను రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారు. అసెంబ్లీలో ఆయన ముఖం చూస్తే ఆ విషయమే స్పష్టమవుతోంది. ఇల్లు, సినిమా ఇండస్ట్రీలోనే నటి త్రిషతో ఎంతో సంతోషంగా గడిపిన రోజులను బహుశా ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో” అంటూ వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని టీవీకే పట్టణ కార్యదర్శి సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై చట్టప్రకారం కేసులు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. “మీరు సామాన్య పౌరుడు కాదు, ఒక ప్రజాప్రతినిధి. పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రికి కనీస గౌరవం ఇవ్వాల్సిందే” అని కోర్టు స్పష్టం చేసింది. 1967 నుంచి తమిళనాడు ప్రజలు సినీ రంగం నుంచి వచ్చిన నేతలను గెలిపిస్తున్నారని, అలాంటప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
- Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
ఇక, కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్దిసేపటికే, ఆత్తూరు మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణులు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో స్థానికంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతానికి ఆయనను ఎస్పీ ఆఫీసుకు తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు. సీఎం విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే ముఖ్య నేత ఒకరు ఇలా అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!