DK shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

  • సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
  • పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
  • రాష్ట్రం కోసం కేంద్రమంత్రుల్ని కలిసినట్లు వెల్లడి
Dke

Dke

ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి క్రమశిక్షణ చాలా కీలకమని.. క్రమశిక్షణ లేకుంటే ఏమీ ఉండదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Cantonment: కేంద్రం సంచలన నిర్ణయం.. కంటోన్మెంట్ ఏరియా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి

ఇటీవల కాలంలో డీకే. శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ పార్టీలోనూ.. బయట నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం స్పందించారు. తనకు ఎవరి సిఫార్సులు అవసరం లేదని, తన పనిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. బెంగళూరులోని తన నివాసంలో శివకుమార్ మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామి తనపై అభిమానంతో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడారని తెలిపారు. తనకు ఎవరి సిఫార్సులు అక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిసినట్లు వెల్లడించారు. కర్ణాటకకు హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్‌ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!