జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు.
రోహిత్ భారత క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేకమైన, భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియో కొన్ని వారాల క్రితం అభిమానులు.. ఆటగాళ్లు పంచుకున్న అన్ని చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించింది. బార్బడోస్‌లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్.. వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు ఈ వీడియోలో చూపిస్తుంది.
ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీకి క్రమశిక్షణ చాలా కీలకమని.. క్రమశిక్షణ లేకుంటే ఏమీ ఉండదని తెలిపారు.
Employment in India: గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పరంగా భారతదేశంలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. దేశంలో గత కొన్ని ఆర్థిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందుతున్నట్లు తాజా పరిశోధన నివేదిక వెల్లడించింది.
ఒడిశా రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ నిన్న (శనివారం) మధ్యాహ్నం ముగిసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు.
చేతిలో డిగ్రీ పట్టా పడిందంటే చాలు.. ఉన్నత చదువుల కోసం చూసేవారు కొందరైతే.. మంచి ఉద్యోగం చేసుకుందాం అనుకునేవారు మరికొందరు.. కానీ, డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతి.. శ్మశానంలో ఉద్యోగం చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇంతకీ.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆ యువతి.. ఎందుకు శ్మశానంలో ఉద్యోగం చేస్తోంది.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్ అనే యువతి..…
కరోనా కాలంలో సాఫ్ట్‌వేర్‌మొదలు చాలా రంగాలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. ఐటీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటిదగ్గర నుంచి ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. అనుకున్న విధంగా వర్క్ ముందుకు సాగదు. ఇంట్లో ఇబ్బందులు సహజమే. అయితే, యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తూ అక్షరాల ఏడాదికి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడట. అతను 6 కంపెనీలకు ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆరూ ఫుల్‌టైమ్…
ఆస్ట్రేలియాలో ఓ కంపెనీ తోటమాలి ఉద్యోగానికి ధరఖాస్తులు కోరింది. ఆ ఉద్యోగం కోసం ఓ మహిళ ధరఖాస్తు చేసుకున్నది. తోటమాలి ఉద్యోగానికి బాడీబిల్డర్ కావాలని, సున్నితమైన మగువలు ఆ పని చేయలేరని, మీరు ఈ ఉద్యోగానికి అనర్హులని కంపెనీ సమాధానం ఇచ్చింది. ఈ ఉద్యోగానికి ఆర్హులని మీరు భావిస్తే ఫలానా నెంబర్ కు కాల్ చేయమని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీనిపై సదరు మహిళ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తనకు వ్యవసాయ పనుల్లో అనుభవం ఉందని,…