DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
- కర్ణాటక రాజకీయాల్లో ‘‘స్టింగ్ ఆపరేషన్’’ కలకలం..
- మెటా గ్లాసెస్ ధరించి, నన్ను రికార్డ్ చేయాలని చూశారు..
- ఒక పారిశ్రామికవేత్తపై డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో ‘‘స్టింగ్ ఆపరేషన్’’ వివాదాలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించిన ఒక పారిశ్రామికవేత్త తనను, కేరళ సీఎం వీడి సతీషన్‌ను రహస్యంగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. కన్నడ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తనను కలిసిన పారిశ్రామికవేత్త ధరించిన కళ్లద్దాలపై అనుమానం రావడంతో అతడి నేపథ్యం, ఇతర రాజకీయ నాయకులతో ఆయన సమావేశాల గురించి వివరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించానని డీకే తెలిపారు.
అక్కడే అనుమానం వచ్చింది..
తనను కలిసేందుకు అధికారుల వద్ద నుంచి సదరు పారిశ్రామికవేత్త అపాయింట్మెంట్ తీసుకున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. ముందుగా వ్యాపార విషయాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటంతో అనుమానం వచ్చిందని సీఎం చెప్పారు. బూత్ స్థాయి వ్యూహాలు, రాజకీయ పరిణామాల గురించి చర్చించడంతో అనుమానం కలిగిందన్నారు.
Also Read
- BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
- Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
- India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
- PM Modi: ‘దేశాన్ని పణంగా పెట్టి విఫల ఉత్పత్తిని ప్రమోట్ చేస్తారా?’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ఇదే వ్యక్తి కేరళ సీఎం వీడీ సతీషన్‌తో కూడా ఇదే విధంగా మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి సమావేశమయ్యారని డీకే పేర్కొన్నారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రితో సమావేశమైనప్పుడు మాత్రం ఈ కళ్లద్దాలు ధరించలేదని ఆరోపించారు.
మంత్రులకు జాగ్రత్తలు..
తనను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారని డీకే శివకుమార్ తెలిపారు. అయితే, ఈ చర్యల గురించి చెప్పబోమన్నారు. కేబినెట్ మంత్రులు, వారి పీఏలు, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా జరిగే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు చెప్పారు.
సిద్ధరామయ్య స్టింగ్ వీడియోతో కలకలం..
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిందిగా చెబుతున్న స్టింగ్ ఆపరేషన్ కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోను ఉపయోగించి సిద్ధరామయ్య ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఆయను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
ఇదిలా ఉంటే, పది మంది మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఒక కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ నేత ఒక ఏజెన్సీకి డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గని ఆరోపించారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. మరోవైపు, సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ను డీకే శివకుమార్ నిర్వహించిందన్న కుమారస్వామి ఆరోపణల్ని డీకే శివకుమార్ ఖండించారు.
తాజావార్తలు
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!