Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Did China Conduct A Secret Nuclear Test After Galwan Clash Us Alleges Covert Test In 2020

Galwan clash: భారత్‌తో ‘‘గల్వాన్ ఘర్షణ’’ తర్వాత, చైనా అణు పరీక్షలు..

Published Date :February 7, 2026 , 7:08 pm
By BV Reddy
  • గల్వాన్ ఘర్షణ తర్వాత, చైనా రహస్య అణు పరీక్షలు..
  • సంచలన విషయాలు చెప్పిన అమెరికన్ అధికారి..
Galwan clash: భారత్‌తో ‘‘గల్వాన్ ఘర్షణ’’ తర్వాత, చైనా అణు పరీక్షలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Galwan clash: 2020లో భారత్, చైనాల మధ్య ‘‘గల్వాన్ ఘర్షణ’’ చోటుచేసుకుంది. దాదాపుగా రెండు దేశాలు యుద్ధం అంచుకు వెళ్లాయి. దీనిపై అమెరికా సంచలన విషయాలు వెల్లడించింది. భారత్‌తో ఈ ఘర్షణ జరిగిన కొన్ని రోజులకే, ప్రపంచం మొత్తం కోవిడ్‌తో బాధపడుతున్న సమయంలో చైనా రహస్యంగా అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో ఈ ఆరోపణ చేశారు. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి.

ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉన్నాయని డినాన్నో చెప్పారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని ఆరోపించారు. గల్వాన్ ఘర్షణ జరిగిన కేవలం 7 రోజుల తర్వాత ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. భారత్ చైనాపై జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు.

చైనా అణుపరీక్షపై యూఎస్ ఏం చెప్పింది.?

చైనా, భారత్ తో ఘర్షణలు జరిగిన 7 రోజులకే జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్‌లో అణు పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారి చెబుతున్నారు. డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. చైనా జూన్ 22, 2020న ఇలాంటి పరీక్ష నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • China nuclear test
  • China secret nuclear test
  • CTBT China nuclear test
  • decoupling nuclear test
  • Galwan Valley clash

తాజావార్తలు

  • Gollalamamidada: సూక్ష్మ కళాకారుడి భక్తి .. 1,01,001 బియ్యపు గింజలపై ‘రామ’ నామం..!

  • AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..

  • Rayavaram Bus Tragedy: రాయవరం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేబినెట్..

  • IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్.. పూర్తి సమాచారం ఇదే!

  • Sadia Imam: పెట్రోల్ ధరలపై ఆగ్రహం.. పాక్‌ నేతలపై నటి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions