NTV Telugu Site icon

Adipurush: ఆదిపురుష్‌పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణ.

Adipurush

Adipurush

Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మూవీ ప్రొడ్యూసర్లను టార్గెట్ చేశారు. ఇందులోని కొన్ని డైలాగ్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు.

Read Also: Diabetes Diet: డయాబెటిస్ ఉన్నవారు రోజూ వీటిని తినాలి.. స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుంది..

ఆదిపురుష్ సినిమాకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు ఇస్తున్నారా..? అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. అభ్యంతరకర డైలాగ్స్ తో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. రాముడు, సీత, హనుమాన్ గురించి ఊహల ఆధారంగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపి ప్రియాంక చతుర్వేది కూడా సినిమా నిర్మాతలపై విరుచుకుపడ్డారు. రామాయణం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో కూడా ఓ పిల్ దాఖలైంది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. రాముడు, సీత పాత్రలపై హిందువుల్లో ఓ అభిప్రాయం ఉందని, వాటిని వక్రీకరిస్తూ సినిమాలో నటీనటుల వేషధారణ ఉందని హిందూ సేన పిటిషన్ లో పేర్కొంది. ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ డైరెక్షన్ లో వచ్చిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడులైంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.