Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది.